ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ మెన్ ఉద్యోగాలకు అర్హులైన నిరుద్యోగ యువకులు దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఎయిర్ మెన్ ఉద్యోగాలకు ఈనెల 15 నుంచి 29 వరకు www.airmenselection.gov.in వెబ్ సైట్ లో పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎయిర్ ఫోర్స్ లో తెలంగాణ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షస్తూ ఎయిర్ ఫోర్స్ ఇంచార్జి పర్సనల్ ఎయిర్ మార్షల్ బి.సురేష్ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు లేఖ రాసినట్లు మిట్టల్ తెలిపారు.
అర్హులైన నిరుద్యోగ యువకులు దరఖాస్తులు చేసుకున్న తరువాత ప్రింట్ అవుట్ తీసుకొని నిర్ణీత సర్టిఫికెట్లు దానికి జత చేసి అక్టోబర్ 13 నాటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చేరేలా పంపించాలి. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ ఎంపిసిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి..అలాగే 1997 జులై 7 నుండి 2000 డిసెంబర్ 20వ తేదీ మధ్యన జన్మించినవారే ఈఉద్యోగాలకు అర్హులు. 2017 ఫిబ్రవరిలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు మిట్టల్ తెలిపారు.
***** Click here for more *****
credit/source: http://happy365dayz.blogspot.in/